- మహిళతో పాటు ఇద్ధరిని అరెస్టు చేసిన అబ్కారీ శాఖ
- ఎండు గంజాయి.. రెండు బైక్ లు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ లోని రెండు ప్రాంతాలలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో బుధవారం మోపాల్ మండలం ఎల్లమ్మ కుంట, నగరంలోని అర్సపల్లి ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎల్లమ్మ కుంట ప్రాంతంలో షేక్ నాజీయా బేగం, కే.మాదవ్ వద్ద 1.135 కిలో గ్రాములు ఎండు గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అర్సపల్లికి చెందిన షేక్ పర్వాజ్ అనే వ్యక్తి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. యువతకు మత్తు పదార్థాలకు అలవాటు చేసే విధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలను విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న తెలిపారు. తొలిసారి గంజాయి కేసులో మహిళను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ దాడులలో ఎస్ఐలు నర్సింహ చారీ, రాం కుమార్ లు, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, సిహెచ్ నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు బోజన్న, హమీద్, శివసాయి, విష్ణు, అవినాష్, మంజుల ఉన్నారు.