ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధికి అడుగులు వేయాలి

 

. . . వేల్పూర్ ఏపీఎం మాణిక్యం

 

వేల్పూర్, బతుకమ్మ :

 

ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని వేల్పూర్ ఏపీఎం మాణిక్యం అన్నారు. మహిళలు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకుని, పొదుపు, డిజిటల్ లావాదేవీలు, బీమా, పెన్షన్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వేల్పూర్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా పంచ సూత్రాలను పాటిస్తూ మహిళలు స్వయం అభివృద్ధి సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్యకు చెందిన మాధురి, లావణ్య, సరిత ముగ్గురు సభ్యులు ఎస్‌బీఐ రీసెట్ కార్యాలయంలో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌సీఆర్‌పీ (ఫైనాన్షియల్ లిట్రసి కమ్యూనిటీ రిసౌర్స్ పర్సన్) శిక్షణకు ఎంపికై విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని తెలిపారు. శిక్షణలో భాగంగా ట్రైనీలు సాక్ష్యం యాప్‌లో బేస్‌లైన్ సర్వే నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత అంశాలు, ఉద్యమ సర్టిఫికెట్ పొందే విధానం, ఐఎల్‌ఏ లోన్ అర్హతలు తదితర అంశాలపై అవగాహన పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు వెన్న మురళీ, సాయన్న, ఆపరేటర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

Every woman should take steps towards economic development.
Comments (0)
Add Comment