27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికలు ప్రజా పోరాటంలో భాగమే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలే ఎజెండాగా ఉద్యమిస్తున్న ప్రజా ఉద్యమకారినిగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 37 డివిజన్ కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ప్రజలు ఓట్లు వేసి గెలిపించి కార్పొరేషన్ కు పంపకపోయినా 37 డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత హామీ ఇచ్చారు. మంగళవారం సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రజా ఉద్యమంలో భాగంగా చూస్తామని తెలిపారు. డబ్బులు, మద్యం ప్రభావం నుండి ప్రజలు విముక్తి చెందే వరకు ప్రజా ఉద్యమ నాయకులు చట్టసభలకు వెళ్ళడం కష్టతరమైన నేపథ్యంలో ప్రజా సమస్యపై మరిన్ని ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆధిపత్య కార్పోరేట్ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం లో ముందు వరుసలో ఉంటానని అన్నారు. నగర అభివృద్ధి కోసం ప్రజలను కూడగట్టి ప్రజా క్షేత్రంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, జిల్లా కమిటి సభ్యులు రాధా లు పాల్గొన్నారు.

More articles

Latest article