అనారోగ్యంతో వృద్ధుడి మృతి

  • అంత్యక్రియలకు యువతరం యూత్ ఆర్థిక సాయం

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని  ఇందల్వాయి గ్రామానికి చెందిన మాదరి నర్సింలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ బుధవారం తుది శ్వాసవిడిచారు. మృతుడు కుటుంబం గత కొన్నెండ్లుగా దీనావస్థ పరిస్థితులలో జీవనం కొనసాగించారు. ఇంటికి వున్న ఒక్క దిక్కు కొల్పడంతో కుటుంబసభ్యులతో విషాదఛాయలు నెలకొన్నాయి. దీంతో యువకులు చలించి 7400 రూపాయలు కూతురుకు అందజేశారు. మృతునికి ఇద్దరు కుమార్తెలున్నారు.ఈ కార్యక్రక్రంలో యువతరం యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Elderly man dies of illness
Comments (0)
Add Comment