. . . నిరసనలో పాల్గొన్న రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ, బతుకమ్మ :
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ బుధవారం బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు అండగా నిలిచి ప్రశ్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు.దేశ యువత భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, పేపర్ లీకేజీలను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై నిర్బంధ చర్యలకు దిగడం ఖండనీయమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగానే బాన్సువాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కాసుల బాలరాజ్ స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ బిన్ మొహసిన్, కౌన్సిలర్ మహమ్మద్ ఖాలెక్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన్సూర్, కౌన్సిలర్ నందకిషోర్, కో-ఆప్షన్ సభ్యులు కమర్ సుల్తానా గౌస్ పాషా , అబ్దుల్ మజీద్, వహాబ్, మాజీ జెడ్పీటీసీ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ నగేష్, గుడాల నగేష్, మట్ట సాయిలు యాదవ్, దాసరి శ్రీనివాస్, బోడ భాస్కర్ తదితర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.