24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని పెద్ద మల్ల రెడ్డి గ్రామంలో దొడ్డి కొమరయ్య జయంతి కార్యక్రమాన్ని కురుమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కురుమ సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆద్యం పోసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని భూమి ముక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమురయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈవో లక్ష్మి, కురుమ సంఘం సభ్యులు ఎర్రోళ్ల పోచయ్య గుమ్మల మంజుల కామారెడ్డి జిల్లా కేవైసీస్ ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల స్వామి జిల్లా ప్రచార కార్యదర్శి వెంకయ్యల రవికుమార్ భిక్కనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పాపనోళ్ల స్వామి మాజీ ఎంపీటీసీ కోడూరు సాయ గౌడ్ బిజెపి గ్రామ అధ్యక్షులు మెట్టు సాయిలు పాల్గొన్నారు.

More articles

Latest article