24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాజీవ్ యువ శక్తి కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రాజీవ్ యువశక్తి కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ  కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం సూచించారు. గురువారం భిక్కనూరు ఎంపీడీవో ఆఫీస్ లో రాజీవ్ యువశక్తి  కార్యక్రమంపై మండల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ప్రీతం మాట్లాడుతూ రాజీవ్ యువశక్తి కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, భిక్కనూరు ఎమ్మార్వో శివప్రసాద్ ఎంపీడీవో రాజ్ రాజ్ కిరణ్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article