విద్యార్థులకు సెల్ ఫోన్లు ఇవ్వద్దు

ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనాథం

ఇందల్వాయి,బతుకమ్మ : 

ఇంటి దగ్గర పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మీనాథం అన్నారు.  ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలలో జరిగిన కొత్త కార్యక్రమాల గురించి,  లైబ్రరీనీ వీక్షించడం జరిగిందన్నారు. 6, 7 తరగతిలలో గల బోర్డులను పరిశీలించి రెండు తరగతులకు వైట్ బోర్డు దాతలుగా దేగం పోచయ్య, నవీన్ చారి  డబ్బులతో సహా ముందుకు రావడం జరిగిందన్నారు. వారికి విద్యార్థులు తరపున పేరెంట్స్ తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

Do not give cell phones to students
Comments (0)
Add Comment