జాతీయ సీనియర్ బేస్ బాల్ పోటీలకు  జిల్లా క్రీడాకారులు

ఆర్మూర్, బతుకమ్మ :  ఈనెల 7 నుండి 9 వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన రాష్ట్ర బేస్ బాల్ పోటీలలో జిల్లా మహిళల జట్టు తృతీయ స్థానం పొందడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా క్రీడాకారులు సుమలత, నిషా(సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల సుద్దపల్లి) ఈనెల 26 నుండి 29 వరకు పంజాబ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికై బయలుదేరినట్లు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా  తెలంగాణ బేస్ బల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్వేతా, ట్రెజరర్ డాక్టర్ చిన్నకృష్ణ ,జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, మరికంటి గంగా మోహన్, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజా రెడ్డి,  సుద్దపల్లి పాఠశాల ప్రిన్సిపల్ నళిని, అకాడమీ కోచ్ మౌనిక, వ్యాయామ ఉపాధ్యాయులు జోష్ణ, శ్రీలత, జిల్లా సాఫ్ట్ బాల్ కోచ్ అనికిత్, నరేష్, క్రీడాకారులను అభినందించారు.

District players for National Senior Baseball Competitions
Comments (0)
Add Comment