ఎల్లారెడ్డి, బతుకమ్మ:
ఎల్లారెడ్డి మండలం మల్లాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను నోటు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. బుధవారం పాఠశాల ఆవరణలో మల్లాయిపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీ మైసయ్య , ఉప సర్పంచ్ పైతర రాజు, ఏ ఏ పీ సి చైర్మన్ పావని , గ్రామ పంచాయతీ సెక్రటరీ వనజ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం , సహాధ్యాయులు సంతోష్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు మంచిగా చదివి ప్రయోజకులు కావాలని కోరారు. మంచి విద్య ద్వారా సమాజానికి, వ్యక్తిగతంగానే ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్య ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.