ఏర్గట్ల, బతుకమ్మ :
తోర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఏర్గట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం గంగ మోహన్ శుక్రవారం తన సొంత ఖర్చలతో పరీక్ష అట్టలు, స్కేల్ లు, పెన్నుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చదివిన తోర్తి గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం చాలా బాగుందని, వారి సలహా సూచన మేరకు విద్యార్థులు తొందర పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి మార్కులు సాధించాలన్నారు. తాను చదివిన పాఠశాలకు, తోర్తి గ్రామానికి, తల్లి తండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి మంచి పేరు తేవాలని కోరారు. అలాగే అత్యధిక మార్కులు సాధించాలని, మంచి మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు తాను సొంత ఖర్చులతో బహుమతులు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద భూమేశ్వర్ విద్యార్థులతో మాట్లాడుతూ మీరు ఎంతో శ్రద్ధతో చదివి అత్యధిక మార్కులు సాధించాలని, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు రూ.5000 మొదటి బహుమతిగా అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అడ్వాల గంగాధర్, లింగారెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు మహేష్, సురేష్, కచ్చకాయల గంగాధర్, నితిన్, దుర్గ, అనిల్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.