బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకుని బిజెపి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఆధ్యాత్మికతనే ఆలంబనగా,మనిషి మనిషిగా ఎదగడమే లక్ష్యంగా ఉండాలని చెప్పిన గొప్ప మానవతావాది అని అన్నారు. అంత్యోదయ సిద్ధాంత రూపకర్త, ఏకాత్మత మానవతావాది సంఘ సంస్కర్త, అర్థశాస్త్రవేత్త, రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుడు పండిట్ దీన్ దయాళ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి, పట్టణ అధ్యక్షులు గంట బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు శాగ లక్ష్మణ్,బాలా గౌడ్, మల్లారం మహేష్ గౌడ్,మేడిశెట్టి బాలయ్య, మారవేని రంజిత్,దుంపెన స్రవంతి, కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Deen Dayal Upadhyaya Jayanti celebrated with grandeur under the auspices of BJP
Comments (0)
Add Comment