వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్‌ కలెక్టర్ వికాస్ మాతో  ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ శాఖ గుంతలు పూడ్చడం, చెట్ల కొమ్మలు తొలగించడం, ఘాట్ల వద్ద శుభ్రత, లైటింగ్, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ 24 గంటల విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందించాలని, తీగల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసులు , శాంతి భద్రతలు కాపాడేలా బందోబస్తు చేపడతారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ నిమజ్జన రోజున మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ గజఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, ట్యూబులు సిద్ధం చేయనుండగా, రెవెన్యూ శాఖ సిబ్బందిని సెక్టర్ వారీగా నియమించనుంది. నిమజ్జనానికి పడుపు వాగు, శక్కర్ నగర్ బావి, డిగ్రీ కాలేజ్ బావి ఘాట్లు గుర్తించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ విటల్, ఎసిపి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Coordination meeting on Vinayaka immersion arrangements
Comments (0)
Add Comment