బాధిత కుటుంబాల పరామర్శ

వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంతో పాటు మండలంలోని లక్కోరా గ్రామంలో పలు బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని తన క్లాస్ మెంట్, బాల్య మిత్రుడు బంగారు దశగౌడ్ ఇటీవలే మరణించిగా వారి కుటుంబ సభ్యులను, బీయర్ యస్ నాయకులు డాక్టర్. చారి తమ్ముడు ప్రభాకర్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం లాక్కొర బీయర్ యస్ గ్రామ శాఖ నాయకుడు సంపత్ తమ్ముడు అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బీయర్ యస్ మండల,పట్టణ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Consultation with the families of the victims
Comments (0)
Add Comment