29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు లు నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం లో పరామర్శించారు. గత నెల 29 న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు లు మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించారు.  ప్రగాఢ సానుభూతి  తెలిపారు. మృతుకి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.రేకుల పల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి, అమ్మ లక్ష్మీ నర్సమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరారు. ఎమ్మెల్యే ల వెంట కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

Congress MLAs visit MLA Bhupathi Reddy

More articles

Latest article