చీమన్ పల్లి పాఠశాలను దర్పల్లికి మార్చండి

0 18,591
  • విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చీమన్ పల్లి పాఠశాల ఎంజే బీసీ గురుకుల గల్స్ స్కూల్ ను దర్పల్లి కి మార్చండని విద్యార్థుల తల్లిదండ్రులు సురేష్, కృష్ణ, విజయ్,రజిత జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్, కృష్ణ,రజిత లు మాట్లాడుతూ.. గత మూడు నాలుగు నెలలుగా ప్రిన్సిపల్ ధర్పల్లికి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగిందన్నారు. మరొక సారి ప్రజావాణిలో విన్నవించడంతో దసరా సెలవులలో  షిఫ్ట్ చేస్తున్నామని ఓ ప్రధాన పత్రిక ద్వారా తెలిపారన్నారు. సెలవులు పూర్తయిన షిఫ్ట్ చేయకపోవడంతో విద్యార్థులను ఈ రోజు వరకు హాస్టల్ కు పంపించలేదని,  విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. చీమన్ పల్లి లో ఉండడం ద్వారా ఇబ్బంది జరుగుతుందని, ఈ విషయాన్ని గమనించి తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.