నేషనల్ సాఫ్ట్ బాల్ కు కాకర్ల నిహారిక ఎంపిక

భీమ్ గల్, బతుకమ్మ : ఈనెల 13 నుండి 16 వరకు మహారాష్ట్రలోని శంబాజీ నగర్లో జరుగనున్న అండర్ 14 సాఫ్ట్ బాల్ విభాగానికి 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు కాకర్ల నిహారిక ఎంపికైనట్లు ముచ్కూర్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ మార్కంటి సుజాత తెలిపారు.ఇటీవలే మెదక్ జిల్లాలో నిర్వహించిన స్టేట్ లెవల్ గేమ్స్ లో జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలువడానికి నిహారిక కీలకపాత్ర పోషించి నేషనల్ లెవల్ టీంకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. అదే తరహాలో స్టేట్ టీం నేషనల్ లేవల్స్ లో ప్రథమ స్థానంలో నిలువడానికి కృషి చేయాలనీ కోచ్, ఫిజికల్ డైరెక్టర్ సుజాత నిహారికకు సూచించారు. ఈ సందర్బంగా నిహారికను స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, వీడీసీ అభినందించారు.

Cocker's nebulous selection for National Softball
Comments (0)
Add Comment