28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్కూల్ కి బస్సు కింద పడి క్లీనర్ మృతి 

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

నిజామాబాద్ నగరంలో ఓ స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందాడు.ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. నగరంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాల చెందిన బస్సు అర్సపల్లిలో విద్యార్థులను స్కూలుకు తీసుకు రావడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బస్సు వెనక్కి తీసే క్రమంలో క్లీనర్ జక్కుల కిషన్ వెంకటయ్య కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం (ఎం) గ్రామానికి చెందిన జక్కుల కిషన్ రెండు రోజుల క్రితమే స్కూల్ బస్సు క్లీనర్ గా చేరాడు. ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article