. . . మార్కెట్ లను పరిశీలించిన పోద్ధుటూరి సుదర్శన్ రెడ్డి
. . . ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి నగరంలో పర్యటించడం జరిగింది. ముందుగా ఖిలా రోడ్ ఫ్రూట్ మార్కెట్ , ఓల్డ్ ఎమ్మార్వో ఆఫీస్ లో గల కురగాయాల, మటన్ మార్కెట్ ను సందర్శించడం జరిగింది .
అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వానాకాలంలో మురికి కాలువలు లోని చెత్తను తొలగించేసి నీరు ఎక్కడ కూడా ఆగకుండా చూడాలని అధికారులను కోరారు. తాగునీటి కొరకు తగు చర్యలు తీసుకోవాలని వర్షం నీరు మురికి కాలువలో వెళ్ళుటకు ,మురికి కాలువ మీద గ్రిల్ ఏర్పాటు చేయవలసిందిగా తగు ఆదేశాలను జారీ చేశారు వర్షాకాలం అనంతరం గుంతలు పడ్డ రోడ్డు బాగు చేయాలని తెలిపారు. ఓల్డ్ ఎమ్మార్వో ఆఫీస్ లో గల మార్కెట్ ను పరిశీలించి ఆగిన పనులు త్వరగా చేసి ప్రజలకు అందుబాటులో తేవలసిందిగా అదేశించారు. ఈ పర్యటనలో నుడా చైర్మన్ కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.