- కాళేశ్వరం ను డమ్మీ చేసి బనకచర్లకు నీటి మల్లింపునకు రేవంత్, చంద్రబాబుల కుట్ర
- అసెంబ్లీ సాక్షిగా రేవంత్, బీజేపీల బంధం బట్టబయలు
- ఎప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలిట గండమే
- మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కాదని కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిర్వచించారు. సోమవారం ఆయన రాజధాని లోని ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన, ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పజీత్ ను ప్రభుత్వం పనిగట్టుకొని తీస్తుందని ఆయన ఆరోపించారు. హామీల అమలు చేయడం చేతగాక, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ కాళేశ్వరం పై బురుదజల్లే ప్రయత్నమన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఒక్క రోజు అసెంబ్లీ ఆదివారం పెట్టి ఆ అసెంబ్లీ లో కాళేశ్వరం పై చర్చ పెట్టి మాట్లాడ్డానికి హరీష్ రావు కు గంట 20 నిమిషాల సమయామిచ్చి 10 మంత్రులు, సీ ఎం తో 11 మంది 33 సార్ల ప్రసంగాన్ని ఆడ్డుకొన్నారని అన్నారు. అంతే కాకుండా రేవంత్ రెడ్డి స్క్రీప్ట్ వ్రాసి ఇచ్చి బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి తోఅసెంబ్లీ లో కాళేశ్వరం పై బూరుదజల్లే ప్రయత్నం చేసారన్నారు. నిన్న అసెంబ్లీ జరిగిన తీరు, అసెంబ్లీలో బిజెపి, కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క ప్రసంగాలను గమనిస్తే బిజెపి, కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బిజెపిల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా బయట పడ్డదన్నారు.