27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అక్రమ రేషన్ బియ్యం రవాణాపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 44 క్వింటాళ్లు స్వాధీనం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కేకే తండా గ్రామానికి చెందిన లావుడియా శ్రీనివాస్ అనే వ్యక్తి ఉప్పల్, హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ప్రజల వద్ద నుండి తక్కువ ధరకు పిడిఎస్ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, నిజామాబాద్, బోధన్ ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు, గురువారం ఉదయం సుమారు 7 గంటలకు ఎల్లారెడ్డి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, శివనగర్ ప్రాంతంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. అతనితో పాటు ఉన్న చరణ్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి నరేష్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనలో సుమారు 44 క్వింటాళ్ల పిడిఎస్ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎల్లారెడ్డి ఎస్ఐ బి.మహేష్ తెలిపారు.

More articles

Latest article