29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

  • రిమాండ్ కు తరలింపు

 

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన మహిళలు మంత్రం చేసిందని కులం నుండి బహిష్కరించి డబ్బులు జరిమాన వేసిన ఐదుగురు  వ్యక్తులను బుధవారం కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్లే గౌరవ మహిళ గత నెలలో మంత్రం చేస్తుందని నేపంతో అదే గ్రామానికి చెందిన కుల పెద్దలు ఆమెను కుల బహిష్కరించి 2,75,000 జరిమానా వేసి బలవంతంగా ఆమె వద్ద నుండి 15వేల రూపాయలు వసూలు చేసి మిగతా డబ్బులు కట్టక పోయిన ఇట్టి విషయం ఎవరికైనా చెప్పిన చంపేస్తామని బెదిరించి కుల బహిష్కరణ చేసి నీ అంతు చూస్తామని బెదిరించగా బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. మండలంలో ఎవరైనా కుల బహిష్కరణకు గురిచేసి పంచాయతీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు దండుగ వేసి వసూలు చేసిన వారిపై చట్టం పకారం చర్యలు తీసుకోబడతాయి అన్నారు.

More articles

Latest article