27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ఎస్ నాయకులు నిరూత్సహం చెందవద్దు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : బీఆర్ ఎస్ నాయకులు నిరూత్సహం చెందవద్దని బీఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి రుద్రూర్ మండల బిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు సూచించారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వేలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీ కవిత బాన్సువాడ నియోజకవర్గానికి భాద్యులను నియమించనున్నారని ఆయన అన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మాత్రనా బీఆర్ఎస్ పార్టీకి నష్టపోయేది ఏమీ లేదన్నారు. పార్టీలో నాయకులు లేనంత మాత్రాన కార్యకర్తలు నిరుత్సాహం చెందవద్దన్నారు. బీఆర్ ఎస్ పార్టీని మరింత బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు నీరడి సాయిలు, శివ, పున్న పుర్గయ్య, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article