27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ బంద్ కు  మద్దతు ప్రకటించిన బీఆర్ ఎస్ 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : బీసీ బంద్ కు   బీఆర్ ఎస్ పార్టీ మద్దతు ప్రకటించిందని ఆపార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుజిత్ సింగ్ ఠాకూర్ తెలిపారు.  ఈమేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బీసీ జేఏసీ పిలుపుమేరకు   రాష్ట్ర బందు లో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ పూర్తిస్థాయిలో పాల్గొని బంధు విజయవంతం చేయడానికి కృషి చేస్తుందన్నారు. అనంతరం బీఆర్ ఎస్ బీసీ నాయకులు  సత్యప్రకాష్ మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి గెలిపిస్తే మోసం చేస్తోందని,  పార్లమెంటులో చేయాల్సిన పనిని శాసనసభలో పెట్టి పనికిరాని పని చేస్తూ ఆ నేపాన్ని ఇతరులపై తోసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థలకు, జరగబోవు ఎన్నికల కోసం తెచ్చిన జీవో. స్థానిక సంస్థలు ఎన్నికల్లో నే కాకుండా విద్యలో, ఉపాధిలో కూడా కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో…
బీఆర్ ఎస్ బీసీ  ఉద్యమ నాయకులు: చింతకాయల రాజు, మాకు రవి, సురేష్, కాళీ చరణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article