బీసీ బంద్ కు మద్దతు ప్రకటించిన బీఆర్ ఎస్
నిజామాబాద్, బతుకమ్మ : బీసీ బంద్ కు బీఆర్ ఎస్ పార్టీ మద్దతు ప్రకటించిందని ఆపార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుజిత్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా బీసీ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్ర బందు లో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ పూర్తిస్థాయిలో పాల్గొని బంధు విజయవంతం చేయడానికి కృషి చేస్తుందన్నారు. అనంతరం బీఆర్ ఎస్ బీసీ నాయకులు ...