27.3 C
Hyderabad
Friday, July 31, 2026

రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తలసేమియా పేషంట్ల కోసం ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని తెలంగాణా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించగా, పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తలసేమియా రోగులను ఆదుకోవాలనే తపనతో రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారిణి బి.గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కలెక్టరేట్ ఎ.ఓ ప్రశాంత్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

Blood donation camp organized by Revenue Employees Association

More articles

Latest article