రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తలసేమియా పేషంట్ల కోసం ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని తెలంగాణా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించగా, పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు, అసోసియేషన్ ప్రతినిధులు స్వచ్చందంగా ముందుకు వచ్చి...