టీ ప్రైడ్ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలి

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ టీ ప్రైడ్, టీ పాస్ పెట్టుబడి రాయితీలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం జిల్లా పెట్టుబడుల ఉన్నతీకరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు టీజీ ఐ – పాస్  కింద 1370 దరఖాస్తులు రాగా,  1327 దరఖాస్తులను ఆయా శాఖల ద్వారా పరిశీలించగా ,1128 దరఖాస్తులను ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు.  టీ ప్రైడ్ పథకం కింద 12 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ. 34,68,551, నలుగురు ఎస్టీ లకు రూ. 11,59,319 లు పెట్టుబడి రాయితీ  మంజూరు చేశామన్నారు.  ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి.లాలు నాయక్, ఎల్డీ ఏం రవికాంత్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రావణ్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Beneficiaries should utilize the Tea Pride scheme
Comments (0)
Add Comment