29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బాపూజీ వచనాలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

Must read

📰 Generate e-Paper Clip

బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ కన్వినర్ కోనేరు సాయికుమార్

నిజామాబాద్, బతుకమ్మ: బాపూజీ వచనాలయ పాలకవర్గం అధ్యక్షుడు భక్తవత్సలం బాపూజీ వచనాలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ కన్వినర్ కోనేరు సాయికుమార్ ఆరోపించారు. బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నీలం రామచంద్రయ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాపూజీ వచనాలయ పాలకవర్గంలో అధ్యక్షుడిగా ఉన్న భక్త వచలం (ఢిల్లీ)  నాయుడు గతంలో నాందేడ్ డివిజన్ నుండి పోటీ చేయడానికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రము ఉపయోగించారని ఆయనపై కరిపే రాజేశ్వర్ (కట్టెలమండి) గతంలో కోర్టులో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విధంగా నిజామాబాద్ డివిజన్ ప్రజల్నే కాకుండా, పురపాలక సంఘ ఉపాధ్యక్షుడిగా పట్టణ ప్రజలని కూడా మోసం చేశారని అన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు బాపూజీ వచనాలయం పాలకవర్గంలో చేరి బ్రష్టు పట్టిస్తున్నారన్నారు.  దళిత,బహుజన సంఘాల నాయకులు బంగారు సాయిలు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్షులు డాక్టర్ కర్క గణేష్, జన్నారపు రాజేశ్వర్ లు మాట్లాడుతూ బాపూజీ వచనాలయ సంబంధించిన పది ఎకరాల లలో ఉన్న స్థలంలో వివిధ రకాల షాపుల, పెట్రోల్ బంకుల నుండి వచ్చిన లక్షల రూపాయల కిరాయి తీసుకొని వచనాలయానికి ఏమాత్రం ఉపయోగపడకుండా తమ సొంత లాభార్జన ధ్యేయంగా వచనాలయ కమిటీ వాళ్ళు ఉండడం దుర్మార్గమన్నారు. ఇప్పుడున్న బాపూజీ వచనాలయానికి సంబంధించిన పాలక వర్గం వారు తామే ఎప్పుడు కొనసాగించే విధంగా తమ కుటుంబ వారికి తమకు సంబంధించిన వారికి సభ్యత్వం తీసుకొని తర్వాత సభ్యత రుసుమును అమాంతం పెంచి సామాన్యులు సభ్యత్వం తీసుకోకుండా చేయడం బాధాకరమన్నారు. ఇప్పుడున్న వచనాలయ కమిటీ ఉపాధ్యక్షుడుగా దాసు అనే వ్యక్తి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో లిక్కర్ మాఫియా దందాను కొనసాగిస్తున్నారని అటువంటి వ్యక్తి వచనాలయ బాపూజీకి ఏ విధంగా అర్హుడు అవుతారని అన్నారు. నిజాంబాద్ నగర ప్రజలు మేధావులు విద్యార్థులు ఇటువంటి లిక్కర్ మాఫియా కు ప్రైవేటు కార్పోరేటుకు సంబంధించిన బడా బాబులకు బాపూజీ వచనాలయాన్ని అప్పగిద్దామా లేదంటే మేధావి వర్గానికి అప్పగిద్దామా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. బాపూజీ వచనాలయ పరిరక్షణ కమిటీ, మేధావుల విద్యార్థులతో పాటు జరిగే పోరాటానికి నిజామాబాద్ ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం నిజామబాద్ డివిజన్ అధ్యక్షులు ఎం. సాయిబాబా,ముషుబ్ పటేల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article