బాధ్యతలు స్వీకరించిన బాన్సువాడ రూరల్ సీఐ

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ రూరల్ సీఐగా టి. రాజేశ్ తన కార్యాలయంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు సీఐ గా పని చేసిన సత్యనారాయణగౌడ్ బదిలీ కాగా ఆయన స్థానంలో రాజేశ్ వచ్చారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ.. రూరల్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు  కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది సీఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Bansuwada Rural CI took charge
Comments (0)
Add Comment