27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కవితకు బెయిల్

Must read

📰 Generate e-Paper Clip

. . . సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్, జాగృతి

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ.

లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వికుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల బీఆర్ఎస్, జాగృతి నాయకులు సంబరాలు నిర్వహించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద జాగృతి ఆధ్వర్యంలో, పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నివాసంలో మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, జాగృతి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, బీఆర్ఎస్ కార్యాలయంలో నగర అధ్యక్షులు సిర్ప  రాజు, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, మురళిల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిక్కర్ కేసులో రాజకీయకక్ష్యతోనే కవితకు జైలుకు పంపించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఈడి ద్వారా కేసు పెట్టించి అక్రమ కేసులు పెట్టి మానసిక శోభకు గురి చేశారన్నారు. బిజెపి పార్టీకి తగిన బుద్ధి  చెప్పి తీరుతామన్నారు. గతంలోనే తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్న మాటలు నేడు నిజమయ్యాయన్నారు.

Bail for MLC Kavitha BRS leaders Celebrations

More articles

Latest article