చిక్కడపల్లిలో పౌర హక్కుల పై అవగాహన

 

రుద్రూర్, బతుకమ్మ :

 

పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం పౌర హక్కుల పై అంగన్వాడి టీచర్లకు, గ్రామస్తులకు తహశీల్దార్ తారాబాయి, ఎంపీడిఓ బాల గంగాధర్ లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్డు కులాల, తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం అత్యాచారాలకు పాల్పడిన లేదా ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. షెడ్యూల్డు కులములు, షెడ్యూల్డు తెగులకు చెందిన లేదా కేటాయించిన భూములను అక్రమంగా ఆక్రమించినా, సాగుచేసిన వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయన్నారు. అంటరానితనం అమానుషమని, అంటరానితనాన్ని పాటించిన వారు శిక్షించబడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మచ్కురి రమేష్, పంచాయతీ కార్యదర్శి, అంగన్ వాడి టీచర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Awareness on civil rights in Chikkadapalli
Comments (0)
Add Comment