23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్టోబర్ 4న పీసీసీ చీఫ్ రాక

Must read

📰 Generate e-Paper Clip

. ఈనెల 29 న కాంగ్రెస్ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం

. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీసీసీ చీఫ్ గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అక్టోబర్ 4న తొలిసారి జిల్లాకు రానున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలుకుతామని, ఇందులో భాగంగా ఈనెల 29న ఉదయం 11గంటలకు పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ ల చైర్మన్లు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు,మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పీసీసీ డెలిగేట్లు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు.

More articles

Latest article