27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బడి బస్సులు భద్రమేనా?

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు

భిక్కనూరు మండల కేంద్రంలోని స్కూళ్ల నిర్వాహకులు బస్సులకు ఫిట్‌నెస్‌ పాటించకపోవడంతో విద్యార్థులకు భద్రత కరువవుతోంది. పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.అయితే స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలు ఇతర సైడ్‌ రైలింగ్‌ లేకున్నా ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. ఆర్టీవో, అధికారులు బస్సులకు ఫిట్‌నెస్‌ లేకున్నా ఎలా అనుమతిస్తున్నారో ప్రశ్నార్థకంగా మారింది. స్కూల్‌ బస్సులకు సైడ్‌ రైలింగ్‌ లేకపోవడంపై విద్యార్థుల భద్రత గురించి పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఆర్టీవో అధికారులు స్కూల్‌ బస్సులపై స్పెషల్‌డ్రైవ్‌ చేసి విద్యార్థులకు భద్రత కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

More articles

Latest article