మద్నూర్, బతుకమ్మ: జూన్ తేదీ 10 నుండి 17 వరకు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం సిడిపిఓ కళావతి ఆధ్వర్యంలో సెల్ఫీ ఫోటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎగ్ బిర్యాని మెనూలో భాగంగా అన్ని అంగన్వాడి కేంద్రాలల్లో ఎగ్ బిర్యానీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ తో పాటు ఎంపీడీవో రాణి, సూపర్వైజర్ కవిత, పోషణ అభియాన్ బీసీ, మాజీ ఎంపీటీసీ, సంగీత కుశల్ మద్నూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ సందీప్,అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు, గర్భిణీలు బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.