కరెన్సీ పై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి

  • ప్రధానికి లక్ష పోస్ట్ కార్డ్స్ పంపిస్తాం
  • డా.జేరిపోతుల పరశురామ్

 

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీ పై అంబేద్కర్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్, దేశవ్యాప్త లక్ష పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై సోమవారం రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంకు విచ్చేసిన సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్, ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొంతం మురళీధర్, ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. డా. బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయనను అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడు పింజ సుదర్శన్ శాలువ, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపిరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు డా.బిఆర్ అంబేద్కర్ రూపాయి దాని సమస్య పరిస్కార మార్గం అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి 1935 ఏప్రిల్ 1 రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే నాడు అంబేద్కర్ లేకుంటే నేడు అర్బీఐ లేదు అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 500 మందితో పోస్ట్ కార్డ్స్ పోస్ట్ భాక్స్ లో వెయ్యడం జరిగింది. జాతీయ జండ రూపాకల్పన కమిటీ ఏర్పడ్డరోజు జాతీయ జండాలో అశోక చక్రం పెట్టిన రోజు జూన్ 23 నుండి 26 జనవరి 2026 వరకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి లక్ష మందితో పోస్ట్ కార్డ్ ఉద్యమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సౌడ జయరాజ్, ఆర్మూర్ మండల కార్యదర్శి కొంతం పూర్ణ చందర్, బాల్కొండ మండల అధ్యక్షుడు జిన్నా జనార్ధన్, మోర్తాడ్ మండల అధ్యక్షుడు అంగుళి మాల, పులి యుగంధర్, వెన్న మోహన్, చిలకముక్కు సురేందర్, ముకేష్, బేగరి శ్రీకాంత్, రాజన్న, వాహెద్ భాయ్, తదితరులు పాల్గొన్నారు.

Ambedkar's photo should be printed on currency
Comments (0)
Add Comment