27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దివ్యాంగ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యం

Must read

📰 Generate e-Paper Clip

. . . దివ్యాంగుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం క్రీడలు నిర్వహణ

. . . జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :           

మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)అంకిత్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శిశు దివ్యాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్లకు జిల్లా దివ్యాంగ వయోవృద్ధుల మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగా విద్యార్థినీ విద్యార్థులకు పలు రకాల క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు కూడా చదువుతో పాటే అన్ని రంగాల్లో తోపాటు క్రీడల్లో కూడా చక్కని ప్రతిభను రాణిస్తారని అన్నారు. రవీంద్ర జైన్ అంధుడు అయినప్పటికి ఆయన స్వరకర్తగా గేయ రచయితగా గాయకుడు గా రామాయణ సీరియల్ కి పనిచేసారని మనందరం చందు ఛాంపియన్ సినిమా చూడాలని అది ఒక దివ్యాంగుడి కి సంబందించిన సినిమా అని ఒక దివ్యాంగుడు పారా ఒలింపిక్ లో స్వర్ణ పథకం సాధించాడన్నారు. దివ్యాంగులు తాము దివ్యంగులమని ఆత్మన్యునత భావానికి గురి కాకుండా మనోధైయిర్యముతో ముందుకు సాగాలన్నారు.

Along with studies, sports are very important for disabled students

అనంతరం జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2024 సంవత్సరంలో భాగంగా గురువారం విభిన్న ప్రతిభావంతుల క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.ఈ క్రీడల్లో దివ్యంగులకు వివిధ రకాల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.అందులో క్యారం, రన్నింగ్,షాట్ పుట్,చెస్ క్రీడలను నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు డిసెంబర్ మూడో తేదీన బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు జిల్లాలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల, అంధుల పాఠశాలలకు చెందిన దివ్యంగులు,గ్రేసీ ఆర్గనైజేషన్,ఏపీ ఫోరానికి చెందిన పాఠశాల విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం జరిగిందన్నారు.సాధారణ వ్యక్తుల కంటే ఈ క్రీడల్లో మానసిక దివ్యంగా విద్యార్థులు ఎంతో అద్భుతంగా ఆటలు ఆడారన్నారు. కార్యక్రమంలోజిల్లా శిశు సంక్షేమ శాఖ సుపెరిండెంట్ ఇందిరా,స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి ఏపీఫోరం సెక్రెటరీ స్వరూప,గ్రేసీ డెప్ స్కూల్ నిర్వాహకురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Along with studies, sports are very important for disabled students

More articles

Latest article