. . . కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే డీఎంఈ ముట్టడిస్తాం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు మెడికల్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వై.ఓ మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన వేతన సవరణ ఒప్పందం కాలపరిమితి ముగిసి సంవత్సరం అవుతున్న ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వెంటనే కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు పిఆర్సి ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రస్తుతం కార్మికులపై పని భారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, ఆర్జిత సెలవులు ఇవ్వాలని ఈ నెల 9న కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముట్టడి ఉన్నదని అప్పటికే సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె నిర్వహించక తప్పదని అన్నారు. ఈ మేరకు ఎడి రమాదేవి కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్, యూనియన్ కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు కవిత, స్వరూప, భారతి, కవిత, వెంకటేష్, మరియు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు