27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నివాసంలో ఏసీబీ తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎక్సైజ్ సూపరింటెండెంట్  కార్యాలయంలో సోదాలు

. . . జనగామ, హైదరబాద్ లోని నివాసలలోను

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కోమ్మూరి మల్లారెడ్డి నివాసంలో మంగళవారం ఏసీబీ సోదాలు చేపట్టింది.ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఎసిబికి అందిన ఫిర్యాదుల మేరకు ఏకకాలంలో నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లోని  ఈ ఎస్ కార్యాలయంలో, శ్రీనగర్ లోని నివాసం( అద్దె) ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డికి స్వస్థలం వరంగల్ జిల్లా జనగామ పాటు హైదరబాద్ లోని నివాసంలో తనిఖీలు చెప్పినట్లు తెలిసింది… అయితే ఇప్పటి వరకు అధికారులు ఎంతమేరకు నగధు, ఆస్తుల  గుర్తించింది వివరాలు వెల్లడించ లేదు .గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మల్లారెడ్డి ఈఎస్ గా పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నిషేదిత మత్తు పదార్థాల కల్లు తయారి ప్యాక్టరీ లకు ప్రసిద్ధి. ప్రతి నెల మత్తు కల్లు తయారీ మాఫీయా నుంచి లక్షల్లో మామూళ్లకు తోడు, మద్యం సిండికేట్ మాఫీయా నుంచి భారీగా నజరానాలు అందుతాయని ప్రచారం జరుగుతుంది.నిజామాబాద్ జిల్లాలో ఆదాయానికి మించిన కేసులో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో జరుగుతున్న సోదాలు ఎంతమేరకు ఆస్తులు బయటపడతాయో వేచి చూడాల్సిందే… నిజామాబాద్  ఎక్సైజ్ ఈ స్ మల్లారెడ్డి సోధరుడు కోమ్మూరి ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే.. అధికార పార్టి నాయకుడు అని తెలిసింది

ACB raids Nizamabad Excise ES's residence

 ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకేనా?

ఇటివల నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య విధి నిర్వహణలో చనిపోవడంతో అధికారుల నిర్లక్ష్యం పై ఎక్సైజ్ సిబ్బంది నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, కమిషనర్ నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లను ముకుమ్మడిగా బాసర జోన్ లోని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో కొందరు కానిస్టేబుళ్లు నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల మాముళ్లు, లంచాల చిట్టాను ఎక్సైజ్ కమిషనర్ తో పాటు ఎసిబి అధికారులకు రాతపూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పక్కా సమాచారంతో  ఈఎస్ నివాసంలో సోదాలు అనే చర్చ జరుగుతుంది…

ACB raids Nizamabad Excise ES's residence

More articles

Latest article