28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన నీటి పారుదల శాఖ డీఈఈ

Must read

📰 Generate e-Paper Clip

 

వరంగల్, బతుకమ్మ : 

 

పది రెండు పడకల గదుల (డబుల్ బెడ్ రూం) ఇండ్ల తాలూకు నిర్మాణం పూర్తిచేసిన బిల్లును మెజర్ మెంట్ బుక్ లో ఎక్కించేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటున్న నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. వరంగల్ జిల్లా పాలకుర్తి  నీటిపారుదల శాఖలో గంటి శ్రీకాంత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. హనుమకొండ భవానీ నగర్ లో ఒక వ్యక్తి  10 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం 2022 లో పూర్తి చేశారు. దాని తాలూకు బిల్లు క్లియరెన్స్ కోసం కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు. సంబంధిత బిల్ క్లియరెన్స్ చేసేందుకు రికార్డుల్లోకి ఎక్కించేందుకు రూ.50 వేల లంచం అడిగాడు పాలకుర్తి డీఈఈ గంటి శ్రీకాంత్. దీంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ ని ఆశ్రయించాడు. ఏసిబి అధికారులు సోమవారం శ్రీకాంత్ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి వరంగల్ ఎసిబి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ కు తరలించారు.

More articles

Latest article