ఏసీబీకి చిక్కిన నీటి పారుదల శాఖ డీఈఈ
వరంగల్, బతుకమ్మ : పది రెండు పడకల గదుల (డబుల్ బెడ్ రూం) ఇండ్ల తాలూకు నిర్మాణం పూర్తిచేసిన బిల్లును మెజర్ మెంట్ బుక్ లో ఎక్కించేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటున్న నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నీటిపారుదల శాఖలో గంటి శ్రీకాంత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. హనుమకొండ భవానీ నగర్ లో ఒక వ్యక్తి 10 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం 2022...