రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో ఐకెపి వివోఏలు సోమవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు జరీనా బేగం మాట్లాడుతూ.. వీవోఏలకు కనీస వేతనం రూ.26,000 వేల ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, 58 జీవో ను సవరించాలని, వివోఏలకు సాధారణ & ఆరోగ్య బీమా సౌకర్యం రూ. 20 లక్షల వరకు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో ఉపాధ్యక్షురాలు జిజియా భాయ్, కార్యదర్శి జి.స్వరూప, సహాయ కార్యదర్శి నాగరాణి, కోశాధికారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.