ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడి తారాస్థాయికి చేరిందని, ఈ దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పి.వై.ఎల్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనీష్, నవీన్ కుమార్, ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి. గోదావరి, కే. సంధ్యారాణి డిమాండ్ చేస్తూ, ముద్రించిన ప్రచార పోస్టర్స్ ను జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఎన్.ఆర్. భవన్ కోటగల్లి ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందక పోవడంతో ప్రజలు తప్పని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారని వారు అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. టెస్టుల పేరుతో, మందుల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని, అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలని కోరారు. ఈ దోపిడీని అరికట్టేందుకు పి.వై.ఎల్, పి.ఓ.డబ్ల్యు రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమం నిర్వహించనున్నట్లు, నవంబర్ 30 వరకు హాస్పిటల్లో సర్వేలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.ఓ.డబ్ల్యు. జిల్లా ఉపాధ్యక్షులు సత్యక్క సహాయ కార్యదర్శి రమా, పి.వై.ఎల్.జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, జిల్లా నాయకులు దండు మహేష్, రాజేశ్వర్, రాజు మహిళా నాయకులు నర్సక్క, పద్మ,పుష్పలత,అమూల్య,లలిత తదితరులు పాల్గొన్నారు.

A movement against exploitation of private and corporate hospital fees
Comments (0)
Add Comment