30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ ల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

.  .  . నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ కొత్తగూడెంకు బదిలీ

హైదరాబాద్, బతుకమ్మ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సిఎస్ రామకృష్ణారావు ఈ మేరకు బదిలీ ఆదేశాలిచ్చారు. అదనపు కలెక్టర్ అంకితను భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుతం ఎవరిని కేటాయించలేదు. అక్కడ పనిచేస్తున్న కలెక్టర్ జితేష్ మీ పాటిల్ ను టీ జీడిఎస్ పీ డీ సిఎల్ చైర్మన్ గా బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను తెలంగాణ భవన్ సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఎండోమెంట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి యాదాద్రి భువనగరి కలెక్టర్ గా నియామకమయ్యారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకాశ శాఖ స్పెషల్ కమిషనర్ గా జనగాం కలెక్టర్ రిజ్వానా భాషా గద్వాలకు బదిలీ అయ్యారు. కరీంనగర్ కలెక్టర్ ప్రమీల సత్పత్తి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

More articles

Latest article