మధ్యాహ్న భోజనం వికటించి 14మంది విద్యార్థులకు అస్వస్థత

ఎల్లారెడ్డి, బతుకమ్మ : మధ్యాహ్న భోజనం వికటించి 14మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.  రోజు మాదిరిగానే విద్యార్థులు పాఠశాలలో బుధవారం మధ్యాహ్నభోజనం చేశారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

14 students fell ill after eating lunch
Comments (0)
Add Comment