25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

‘అమ్మ మాట – అంగన్వాడి బడి బాట’ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని గోశాల అంగన్వాడి కేంద్రంలో ‘అమ్మ మాట – అంగన్వాడి బడి బాట’ కార్యక్రమాన్ని గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ డి. పద్మ, సూపర్వైజర్ రాధిక నేతృత్వం వహించారు. పిల్లలలో విద్యాబుద్ధిని పెంపొందించే దిశగా వీరిని పాఠశాలలకు సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క  ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతోంది. ప్రత్యేకతగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా రూపొందించిన కొత్త ఆహార మెనూలో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో తొలిసారిగా ఎగ్ బిర్యానీ అందించడం ప్రారంభమైంది. ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో కూడిన ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా గోశాల అంగన్వాడి కేంద్రంలో ఎగ్ బిర్యానీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పుష్పలత, కళావతి, శ్యామల పాల్గొనగా, పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు హర్షాతిరేకంగా పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యం, విద్య అభివృద్ధి దిశగా ఇది ఎంతో ఉపయోగకరమని సీడీపిఓ పేర్కొన్నారు.

‘Amma Mata – Anganwadi School Path’ launched

More articles

Latest article