27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు అంబేద్కర్

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

పేద ప్రజల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని శెట్ పల్లీ సర్పంచ్ పెగడ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా యన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల చీకటి జీవితాల్లో చదువుతోను, ఓటు హక్కు తోను వెలుగు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని గుర్తు చేశారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article