అంబేద్కర్ విగ్రహావిష్కరణ కరపత్రాల ఆవిష్కరణ

0 14,555

భీమ్ గల్, బతుకమ్మ : ఈ నెల 22 గురువారం 4గంటలకు మండలంలోని లింగాపూర్ చౌత్ లో నిర్వహించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని ముద్రించిన కర పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం మండల కేంద్రం లో నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమ నిర్వహణ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రిక్క లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానా చార్యులు ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాశీ ము, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పున్నయ్య తదితరులు హాజరౌతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బహుజన యుద్ధనౌక, ప్రజా గాయకులు ఏపూరి సోమన్న కళాబృందం ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన భీంగల్ ప్రాంత అధ్యక్షులు గడల ప్రసాద్, ఐక్య సంఘటన నాయకులు పర్స నవీన్: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య, విగ్రహావిష్కరణ కమిటీ చైర్మన్ గట్టు ఈశ్వర్, సూరి నీడ అశోక్ , బిజెపి భీంగల్ మండల అధ్యక్షుడు ఆరె రవీందర్ , ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరే రమేష్ , భీమ రవీందర్  గిరిజన సంఘ నాయకులు తుక్కాజి నాయక్, గౌడ సంఘం అధ్యక్షులు రామా గౌడ్ బండారి గంగాధర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.