30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో  పాలిటెక్నిక్ ఉచిత తరగతుల విద్యార్థులతో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ ప్రముఖ్  రెంజల్రా నరేష్ మాట్లాడుతూ కులం పేరుతో గుణాన్ని గణిస్తూ జ్ఞానాన్ని లెక్కచేయని సమాజం అజ్ఞానాంధకారంలోనే ఉంటుందన్నారు. మహర్షులు,పురాణ పురుషులు,మహానీయులు నిమ్న కులంలో పుట్టినా ఆరాధించే జనాలు..సాటి మనిషిని ఆ భావనతో ప్రేమించక పోవడం బాధాకరమన్నారు. పసి వయసులోనే వివక్షతను అంబేద్కర్ ఎదుర్కొన్నారని తెలిపారు. అణచివేత,అసమానత,పీడనలపై విద్య తో పోరాట అస్త్రాన్ని సంధించి ఆధునిక కాలంలో “సమరసత”ను సాధించడానికి మార్గం సుగమం చేసిన యుగ పురుషుడు అంబేద్కర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, జిల్లా వ్యవస్థ ప్రముఖ సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షులు వెంకట కృష్ణ, నగర కార్యదర్శి బాలకృష్ణ, కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, అభినవ్, రంజిత్, సాత్విక్, ఇంద్రసేన, సునీల్,  రాకేష్, నవీన్, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Ambedkar Jayanti celebrated with grandeur under the auspices of ABVP

More articles

Latest article