ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత తరగతుల విద్యార్థులతో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజల్రా నరేష్ మాట్లాడుతూ కులం పేరుతో గుణాన్ని గణిస్తూ జ్ఞానాన్ని లెక్కచేయని సమాజం అజ్ఞానాంధకారంలోనే ఉంటుందన్నారు. మహర్షులు,పురాణ పురుషులు,మహానీయులు నిమ్న కులంలో పుట్టినా ఆరాధించే జనాలు..సాటి మనిషిని ఆ భావనతో ప్రేమించక పోవడం బాధాకరమన్నారు. పసి వయసులోనే వివక్షతను అంబేద్కర్ ఎదుర్కొన్నారని తెలిపారు. అణచివేత,అసమానత,పీడనలపై విద్య తో పోరాట అస్త్రాన్ని...